ఆర్టీసీ అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ సమీక్ష నిర్వహిస్తున్నారు. రేపట్నించి రాష్ట్రంలో బస్సులు నడిపే విషయమై చర్చిస్తున్నారు. సాయంత్రం కేబినెట్ భేటిలో చర్చించవలసిన విషయాలపై భేటి సాగుతుంది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రిమండలి సమగ్రంగా చర్చించి, బస్సులు నడిపేందుకు అనుమతించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి ఇప్పటికే 50 శాతం బస్సులను తిప్పేందుకు కేంద్ర అనుమతులున్నా వ్యాధి వ్యాపిస్తుందనే అనుమానంతో ప్రభుత్వం నడపలేదు.
ఆర్టీసీ అధికారులతో మంత్రి పువ్వాడ సమీక్ష - puvvada reviwe
ఆర్టీసీ అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు నడిపే విషయమై అధికారులతో చర్చిస్తున్నారు. సాయంత్రం కేబినెట్ సమావేశం నేపథ్యంలో ప్రజారవాణా సాధ్యసాధ్యాలపై భేటీ సాగుతుంది.
ఆర్టీసీ అధికారులతో మంత్రి పువ్వాడ సమీక్ష
తాజాగా రాష్ట్రంలో ఆరెంజ్, గ్రీన్ జోన్ల సంఖ్య పెరగడంతో బస్సులు నడపాలనే ప్రభుత్వం భావిస్తోంది. కంటైన్మెంట్ జోన్లు మినహా గ్రామీణ, జిల్లా, రాజధానికి నడిచే బస్సు సేవలు, వాటిల్లో పరిమితంగా ప్రయాణికులకు అనుమతించడం, వ్యక్తిగత దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు. ఇతర రాష్ట్రాలకు బస్సు సర్వీసులపై ఇంకా స్పష్టత రాలేదు. ఆయా రాష్ట్రాల పరిస్థితులు, సమన్వయం ఇతర అంశాల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకునే వీలుంది.
ఇవీ చూడండి:కూలీ బతుకు.. అందని మెతుకు !