రెండోసారి కరోనా బారిన పడిన మంత్రి పువ్వాడ అజయ్ - second time corona positive to minister puvvada ajay kumar

MINISTER PUVVADA AJAY TESTED COVID POSITIVE
19:08 May 01
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రెండోసారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని మంత్రే స్వయంగా.. ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తేలికపాటి లక్షణాలు ఉండటం వల్ల ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా... పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు తెలిపారు.
ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని తెలిపిన మంత్రి... ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించారు. గడచిన వారం రోజులుగా తనను కలిసిన వాళ్లు కూడా పరీక్షలు చేసుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: 'కొవిడ్ సోకిన వారు ఈ జాగ్రత్తలు తీసుకుంటే గుండెపోటు రాదు..'
Last Updated : May 1, 2021, 7:39 PM IST