Puvvada ajay kumar comments: కొవిడ్ కారణంగా టీఎస్ఆర్టీసీ ఇంకా కోలుకోలేదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ఇప్పటవరకు సగం ఆదాయం మాత్రమే వస్తోందని మంత్రి స్పష్టం చేశారు. శాసనమండలి సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధులతో మంత్రి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మెట్రో రైలు సర్వీసును ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లా తెరాసలో విభేదాలెక్కడివి.. అవన్ని పుకార్లేనన్న పువ్వాడ - ఖమ్మం జిల్లా తెరాస
Puvvada ajay kumar comments: శాసనమండలి సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధులతో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. టీఎస్ఆర్టీసీ ఇంకా కోలుకోలేదన్న మంత్రి.. మెట్రో రైలు సర్వీసులు ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇక ఖమ్మం జిల్లాలోని తెరాసలో విభేదాలపై మంత్రి స్పందించారు.
Minister Puvvada ajay kumar comments on the differences in TRS Khammam district
మెట్రో రైలు విషయంలో కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ప్రకారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. రోజుకు నాలుగు లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తేనే.. నష్టాలుండవని పేర్కొన్నారు. మెట్రోకు భూములు ఇచ్చినా.. పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకులేదన్నారు. ఖమ్మం జిల్లాలోని తెరాసలో విభేదాలు వస్తున్నాయన్న ప్రచారాన్ని మంత్రి ఖండించారు. ఎలాంటి విభేదాలు లేవని పువ్వాడ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: