తెలంగాణ

telangana

ETV Bharat / city

Minister Puvvada ajay kumar: 'దేశంలోనే అతి పెద్ద వాహనాల తయారీ యూనిట్​లు తెలంగాణలో..' - Puvvada ajay kumar attended round table meeting

ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం, పెట్టుబడుల ఆకర్షణపై రూపొందించాల్సిన విధివిధానాలపై గోవాలో కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి శాఖ ఆధ్వర్యంలో రౌండ్​ టేబుల్​ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ తరఫున మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ హాజరయ్యారు.

Minister Puvvada ajay kumar attended round table meeting in goa
'దేశంలోనే అతి పెద్ద వాహనాల తయారీ యూనిట్​లు తెలంగాణలో..'

By

Published : Dec 4, 2021, 9:13 PM IST

విద్యుత్​ వాహనాల తయారీలో అగ్రగామి.. మేఘా ఇంజినీరింగ్ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్​ టెక్ లిమిటెడ్​ రూపొందించిన బస్సులు మార్కెట్​లోకి విడుదలయ్యాయి. ఈ బస్సులను గోవాలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే జెండా ఊపి ప్రారంభించారు. ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం, పెట్టుబడుల ఆకర్షణపై రూపొందించాల్సిన విధివిధానాలపై గోవాలోని లాలిట్ గోల్ఫ్ అండ్ స్పా రిసార్ట్, కెనకోనాలో కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశానికి రాష్ట్రం తరఫున రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు.

ఒలెక్ట్రా గ్రీన్​ టెక్ లిమిటెడ్​ రూపొందించిన బస్సులు

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్​ వాహనాల తయారీపై వివిధ ప్రోత్సాహకాలు అందిస్తున్న దృష్ట్యా.. దేశంలోనే అతి పెద్ద వాహనాల తయారీ యూనిట్​లను రూ.300 కోట్ల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్​లో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పువ్వాడ తెలిపారు. ఈ ప్లాంట్​ను అతి తక్కువ మానవ ప్రమేయంతో.. పూర్తిస్థాయి ఆటోమేషన్ మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. ఇక్కడ బస్సులతో పాటు ఆటోలు, ట్రక్కులు, ఇతర వాహనాలు కూడా తయారు చేయనున్నట్టు వివరించారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details