తెలంగాణ

telangana

ETV Bharat / city

'ప్రపంచమే అబ్బురపడేలా నూతన సచివాలయ నిర్మాణం..' - minister prashanth reddy

సచివాలయ పనుల పురోగతిని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. అంతస్తుల వారీగా పనుల పురోగతిని ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైఅంతస్తు వరకు నిర్మాణ పనులు సమాంతరంగా జరగాలన్న ప్రశాంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ విధించిన గడువులోగా పనులు పూర్తి కావాలని ఆదేశించారు.

minister prashanth reddy visited new Secretariat works
minister prashanth reddy visited new Secretariat works

By

Published : Feb 27, 2022, 5:18 AM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన సచివాలయం.. ప్రపంచమే అబ్బురపడేలా ఉంటుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సచివాలయ పనుల పురోగతిని మంత్రి పరిశీలించారు. సచివాలయానికి సంబంధించి మెయిన్ గ్రాండ్ ఎంట్రీ, బేస్మెంట్ ఎలివేషన్, కోర్ట్ యార్డ్, కాంపౌండ్ వాల్ అర్నమెంట్ గ్రిల్, ఫాల్ సీలింగ్, గ్రౌండ్ ఫ్లోర్ కారిడార్, గ్రానైట్స్ ఫ్లోరింగ్ డిజైన్, ఫైర్ సేఫ్టీ వర్క్స్, ఎంట్రన్స్ లాబీ, మంత్రులు, ఆఫీసర్స్ ఛాంబర్స్ పనులను పరిశీలించారు.

అంతస్తుల వారీగా పనుల పురోగతిని ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. బేస్మెంట్ ఎలివేషన్ కోసం వినియోగించే దోల్ పూర్ స్టోన్ మొత్తం మూడు వేల క్యూబిక్ మీటర్ల మేర పట్టనుండగా.. రోజు 50 క్యూబిక్ మీటర్ల చొప్పున 60 రోజుల్లో తెప్పించి పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులు, గుత్తేదారును ఆదేశించారు. మెయిన్ ఎంట్రీ అర్నమెంట్ రెయిలింగ్ గ్రిల్, మెయిన్ గ్రాండ్ ఎంట్రన్స్ మెట్ల మార్గంలో వాడే రెయిలింగ్ డిజైన్, యూపీవీసీ విండోస్ నమూనాలను పరిశీలించి సూచనలు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైఅంతస్తు వరకు నిర్మాణ పనులు సమాంతరంగా జరగాలన్న ప్రశాంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ విధించిన గడువులోగా పనులు పూర్తి కావాలని ఆదేశించారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details