సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొత్త సచివాలయ నిర్మాణానికి ఉపయోగించే.. రాళ్లు, ఫౌంటైన్ డిజైన్ల కోసం రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి రాజస్థాన్‌లో పర్యటిస్తున్నారు. జైపూర్ సమీప ప్రాంతాల్లో మూడోరోజూ పర్యటించిన ప్రశాంత్‌రెడ్డి బృందం... విభిన్న రకాల స్టోన్లను పరిశీలించారు. సికంద్ర, మాన్పుర్‌కు వెళ్లారు.
రాజస్థాన్‌లో మూడోరోజూ మంత్రి ప్రశాంత్‌రెడ్డి పర్యటన - telangana varthalu
రాజస్థాన్‌లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి పర్యటన మూడోరోజు కొనసాగింది. సచివాలయ నిర్మాణం కోసం రాళ్లు, ఫౌంటైన్ డిజైన్లను మంత్రి పరిశీలించారు. పలు ప్యాలెస్‌లను మంత్రి సందర్శించారు.
రాజస్థాన్‌లో మూడోరోజూ కొనసాగిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి పర్యటన
రాంబాగ్ ప్యాలెస్, మహారాజ మాన్సింగ్ ప్యాలెస్, మహారాణి గాయత్రి దేవి ఫౌంటైన్‌ను సందర్శించారు. మాన్పుర్‌లోని స్టోన్ కార్వింగ్ వర్క్ షాపులను, వాటర్ ఫౌంటైన్ల డిజైన్, స్టోన్‌లను పరిశీలించారు. అక్కడి అధికారులను, స్థానికులను అడిగి విశేషాలు తెలుసుకున్నారు.
ఇదీ చదవండి: నడ్డా సమక్షంలో భాజపాలో చేరిన శ్రీశైలం గౌడ్