రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సచివాలయం.. అనుకున్న సమయానికి పూర్తి కావాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులు, ఇంజినీర్లు, గుత్తేదార్లు, ఆర్కిటెక్టులతో మంత్రి సమావేశమయ్యారు. సచివాలయం, సమీకృత కలెక్టరేట్లు, అమరువీరుల స్మారకం పనుల పురోగతిపై సమీక్షించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రతి ఆలోచన ప్రజల అభివృద్ధి కోణంలోనే ఉంటుందన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఎన్నో గంటల మేథోమధనం తర్వాతే ఆయన నిర్ణయాలు ఉంటాయని ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
సచివాలయ నిర్మాణానికి అవసరమయ్యే సామగ్రిని నెలలోపు ఖరారు చేసుకుని.. సమకూర్చుకోవాలని సూచించారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి నెలలోపు ఐదు దశల్లో సామగ్రిని ఖరారు చేయాలని నిర్ణయించారు. పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఆర్ అండ్ బీ అధికారులు, గుత్తేదారులు, ఆర్కిటెక్ట్‌లతో అంతర్గత కమిటీని ఏర్పాటు చేశారు. పనిలో జాప్యం జరగకుండా, పూర్తి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని ప్రశాంత్ రెడ్డి సూచించారు.
వీలైతే దిల్లీ వెళ్లి..