కరోనా, లాక్డౌన్ పరిస్థితుల వల్ల రెండు పడక గదుల ఇళ్లు సహా నిర్మాణ రంగంలో ఉన్న వలస కార్మికులందరికి సంబంధించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కొన్ని నిర్మాణ సంస్థలు వలస కార్మికులకు భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తున్నాయన్నారు. ట్రాఫిక్ లేనందున జాతీయ రహదార్లపై నిర్మాణ, మరమ్మతు పనులను వేగవంతం చేసినట్లు వెల్లడించారు. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామంటున్న మంత్రి ప్రశాంత్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి..
లాక్డౌన్ సమయాన్ని వినియోగించుకుంటున్నాం: ప్రశాంత్‌రెడ్డి - వలస కార్మికులను ఆదుకుంటున్నాం
లాక్డౌన్ సమయాన్ని రహదారుల నిర్మాణాలు, మరమ్మతులు చేసేందుకు వినియోగిస్తున్నట్లు మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. వలస కార్మికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు.
లాక్డౌన్ సమయాన్ని వినియోగించుకుంటున్నాం: ప్రశాంత్‌రెడ్డి