తెలంగాణ

telangana

ETV Bharat / city

Minister perni nani: వరదల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం: పేర్నినాని - ఏపీ వరద బాధితుల తాజా సమాచారం

minister perni nani: వరదలు, వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని ఏపీ రవాణా శాఖల మంత్రి పేర్ని నాని స్పష్టం(Minister Perni nani react on floods) చేశారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ఒక్కో కుటుంబానికి రెండు వేల రూపాయలు సహా ఇతర నిత్యావసరాలు అందిస్తామని తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని మంత్రి వెల్లడించారు.

Minister Perni nani react on floods
perni nani

By

Published : Nov 23, 2021, 12:33 PM IST

వరదలు, వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని ఏపీకి చెందిన మంత్రి పేర్నినాని (Minister Perni nani react on rains) స్పష్టంచేశారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ఒక్కో కుటుంబానికి రూ. 2 వేలు, ఇతర నిత్యవసరాలు అందించాలని నిర్ణయించిన్నట్లు తెలిపారు. పునరావాసం కోసం అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. 104 సేవలను నాలుగు జిల్లాలకు మరింత విస్తృతంగా విస్తరిస్తున్నట్లు వివరించారు.

ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్న 104 సేవలు ఉపయోగించుకోవచ్చని మంత్రి (minister perni nani latest news) తెలిపారు. విధి నిర్వహణలో ముగ్గురు చనిపోయారని తెలిపారు. వారి కుటుంబాలను ఆదుకోవడానికి రూ. 25 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించిందన్నారు.

మొత్తం 10 మంది మృతి చెందారని... వారికి రూ. 5 లక్షల ఎక్స్​గ్రేషియ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేస్తామన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకి పరిహారం ఇస్తామని తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని మంత్రి వెల్లడించారు.

ఇదీ చదవండి:Ap rains 2021: వానలు ఆగినా.. తప్పని తిప్పలు!

ABOUT THE AUTHOR

...view details