తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ఎవరూ ఏమీ అనలేదని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. శాసనసభలో ఆయన సతీమణి ప్రస్తావనే రాలేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై పురందేశ్వరి కూడా ట్వీట్ చేశారని.. ఆమెకు ఇదే చెబుతున్నామని పేర్కొన్నారు. నిజంగానే రాష్ట్ర చరిత్రలో నిన్న ఒక బ్లాక్ డే నే అన్న పేర్నినాని.. 40 ఏళ్ల రాజకీయ నాయకుడు చంద్రబాబు కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగి చరిత్రను హీనం చేశారని ఆక్షేపించారు(perni nani comments on chandrababu).
బాలకృష్ణ అమాయక చక్రవర్తి..
బాలకృష్ణ ఒక అమాయక చక్రవర్తి.. ఆయన బావ ఏమి చెబితే అదే నమ్మేస్తున్నారని పేర్ని నాని వ్యాఖ్యానించారు( perni nani clarity on chandrababu issue). చంద్రబాబు చెప్పుడు మాటలను విని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు స్పందించారన్నారు. తోబుట్టువు లాంటి వ్యక్తిని ఎవరూ ఏమీ అనలేదని పదేపదే చెబుతున్నామని తెలిపారు. దేవాలయం లాంటి శాసనసభలో బూతుల సంస్కృతిని ప్రవేశపెట్టిందే చంద్రబాబేనని ఆయన ఆరోపించారు. చంద్రబాబు తన అనుభవాన్ని రంగరించి మెలో డ్రామా సృష్టించారని ఆరోపించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులను, ఆయన సతీమణి పేరును శాసనసభ లో ఎవరు ఉచ్చరించలేదని స్పష్టం చేశారు. రాజకీయాలను రాజకీయలతోనే ఎదుర్కోవాలన్న ఆయన.., కుటుంబ మర్యాదను పక్కన పెట్టి చంద్రబాబు ఈ డ్రామా చేశారని దుయ్యబట్టారు.
ఆ ఫోన్ రికార్డును బయట పెట్టండి..
అసెంబ్లీలో ఫోన్లతో రికార్డు చేయకూడదని.. కానీ తెదేపా సభ్యులు రికార్డు చేసిన వీడియోను అందరికి పంపారన్నారు. చంద్రబాబు సతీమణిని ఎవరైనా ఏమైనా అని ఉంటే ఆ ఫోన్ రికార్డును బయట పెట్టాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. అసలు చంద్రబాబు సతీమణి ప్రస్తవన శాసనసభలో రాలేదని తెలిపారు. ఆమె పేరును శాసనసభలో ప్రస్తావించినట్టుగా చంద్రబాబు చిత్రీకరణ చేస్తున్నారని విమర్శించారు. అనని మాటలను ఇద్దరు శాసన సభ్యులకు ఆపాదించటం రాజకీయంగా దుర్మార్గపు ప్రక్రియగా పేర్నొన్నారు. నటులు బాలకృష్ణ ఆయన తోబుట్టువులు కూడా ఈ ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. ఎన్టీఆర్ గురించి వారికి చెడుగా నమ్మించగలిగిన చంద్రబాబు.. ఈ అంశంలో కూడా ఇలాగే చేస్తున్నారని పేర్నినాని ఆరోపించారు. సాగుచట్టాలను వెనక్కు తీసుకునేలా(Farm laws repealed news) చేసిన రైతుల విజయాన్ని సంఘీభావంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ చేస్తోందని ఆయన తెలిపారు.
చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు.. హెచ్చరించిన బాలకృష్ణ