ఏప్రిల్‌లో వసతి దీవెన, విద్యా దీవెన పథకాలను అమలు చేయనున్నట్లు ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. 2021-22లో అమలు చేసే పథకాల క్యాలెండర్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఏప్రిల్‌లో రైతులకు, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాలు అమలు చేయనున్నట్లు వివరించారు. మే నెలలో మత్స్యకార భరోసా అమలు చేస్తామన్న ఆయన.. జూన్‌లో వైఎస్‌ఆర్ చేయూత, జగనన్న విద్యాకానుక అమలవుతాయన్నారు.
'జులైలో వైఎస్‌ఆర్ వాహనమిత్ర పథకం అమలు చేస్తాం. ఆగస్టులో నేతన్న నేస్తం, అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం ఇస్తాం. సెప్టెంబరులో వైఎస్‌ఆర్ ఆసరా పథకం, అక్టోబరులో రైతు భరోసా రెండో విడత, చేదోడు, తోడు పథకాలు, నవంబరులో కొత్తగా ఆమోదించిన ఈబీసీ నేస్తం, డిసెంబరులో 2, 3వ విడత విద్యాదీవెన, వసతిదీవెన, లా నేస్తం అమలు చేస్తాం'