తెలంగాణ

telangana

ETV Bharat / city

Cinema Tickets News : జగన్​తో మంత్రి పేర్ని నాని భేటీ.. సినిమా టికెట్ల అంశంపై చర్చ - ముఖ్యమంత్రి జగన్‌తో మంత్రి పేర్నినాని భేటీ వార్తలు

Cinema Tickets News : ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ మేరకు సీఎం జగన్​తో ఆ రాష్ట్ర మంత్రి పేర్ని నాని భేటీ అయ్యారు. మరోవైపు ఈనెల 10న సీఎం జగన్​తో చిరంజీవి సహా లువురు సినీ పెద్దలు సమావేశం కానున్నారు.

Cinema Tickets News
perni nani

By

Published : Feb 8, 2022, 4:24 PM IST

Cinema Tickets News : సినిమా టికెట్ల పెంపు అంశంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో మంత్రి పేర్నినాని భేటీ అయ్యారు. ప్రభుత్వ కమిటీ చేసిన అధ్యయనం గురించి చర్చించారు.

సినిమా టికెట్ల కనిష్ఠ, గరిష్ఠ ధరలు, సినిమా థియేటర్ల యజమానుల సమస్యలపై చర్చించారు. టికెట్ల వ్యవహారంపై ఇప్పటికే దాదాపు నివేదిక సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 10న చిరంజీవితోపాటు సినీ పెద్దలు సీఎం జగన్‌ను కలవనున్నారు. సినీ ప్రముఖులతో చర్చించి టికెట్‌ ధరలపై సీఎం ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ఇదీచూడండి:ఈ వారం థియేటర్‌/ఓటీటీలో రిలీజ్​ అయ్యే చిత్రాలివే!

ABOUT THE AUTHOR

...view details