తెలంగాణాలో రాజకీయ శూన్యత వల్లే కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయని (minister perni nani comments on telangana politics) ఏపీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. అందుకే ఓ ఐపీఎస్ రాజీనామా చేసి ఓ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారని.. మరికొన్ని పార్టీలూ వచ్చాయని అభిప్రాయపడ్డారు. ఏపీలో 151 స్థానాలు వచ్చిన తర్వాత శూన్యత ఎక్కడుందని..? మంత్రి ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజల గుండెల్లో ఎక్కడా శూన్యత లేదన్నారు.
మరోవైపు నదీ జలాల వినియోగం విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మాట తప్పారని (minister perni nani comments on cm kcr news) మంత్రి పేర్ని నాని అన్నారు. డిండి-పాలమూరు ప్రాజెక్టుల్లో తాగునీరు పేరుతో సాగుకు మళ్లించారని మంత్రి నాని ఆరోపించారు. ఏపీకి కేటాయించిన నీటిలో అదనంగా చెంచాడు నీళ్లు కూడా వినియోగించబోమని ఎప్పుడో చెప్పామని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత విషయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ ఎంత దూరమో.. విజయవాడ నుంచి హైదరాబాద్ అంతే దూరమని గమనించాలన్నారు. రోజూ వార్తల్లో ఉండాలనుకునే రేవంత్ రెడ్డి వంటి వాళ్లు(minister perni nani slams revanth reddy news).. సంచలనాల కోసం ఏ అంశంపై అయినా ట్వీట్లు చేస్తారని ఏపీ మంత్రి మండిపడ్డారు.