Minister Perni Nani on APSRTC: త్వరలోనే ఏపీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపడుతామని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. 1,800 మందికి కారుణ్య నియామకాలను గ్రామ, వార్డు సచివాలయాలతోపాటు మిగిలిన శాఖల్లో భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు కారుణ్య నియామకాల భర్తీకి చర్యలు చేపట్టినట్లు మంత్రి స్పష్టం చేశారు. అలాగే.. సీనియర్ సిటీజన్లకు ఆర్టీసీలో 25 శాతం రాయితీ ఇస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
60 ఏళ్లు దాటిన వారికి ఆర్టీసీలో 25 శాతం రాయితీ: ఏపీ మంత్రి పేర్నినాని - సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీలో 25 శాతం రాయితీ
Minister Perni Nani on APSRTC: సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీలో 25 శాతం రాయితీని ఏప్రిల్ నుంచి పునరుద్ధరిస్తున్నట్లు ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో మాదిరే ఆర్టీసీలోనూ కారుణ్య నియామకాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
APSRTC
చమురు కంపెనీల నుంచి కొనే డీజిల్ ధరలో మార్పులు వచ్చాయి. అయితే బయట బంకుల్లో డీజిల్ కొనుగోలుతో రోజుకు రూ.కోటిన్నర ఆదా అవుతుంది. తిరుపతి నుంచి తిరుమల, మదనపల్లె, నెల్లూరుకు తొలుత ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతాం. ఆర్టీసీలో వృద్ధులకు 25 శాతం రాయితీ ఏప్రిల్ నుంచి పునరుద్ధరణకు చర్యలు చేపట్టాం. -పేర్ని నాని, ఏపీ మంత్రి
ఇదీ చూడండి:'కంటోన్మెంట్ బోర్డ్ తొలగించిన ఓట్లను వెంటనే పునరుద్ధరించాలి'