కరోనా కారణంగా మూడు రాజధానుల అంశంలోనూ ఏపీ ప్రభుత్వం తక్షణ నిర్ణయాలేమీ తీసుకోవటం లేదు. కరోనా తగ్గుముఖం పట్టాకే రాజధాని మార్పు గురించి మాట్లాడతాం. రాజధాని తరలింపు అంశం గవర్నర్ కూడా చెప్పారు. రాజధాని తరలింపుపై సరైన సమయంలో తదుపరి నిర్ణయం ఉంటుంది.
-మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
'రాజధాని మార్పు గురించి ఆలోచించే పరిస్థితి లేదు' - చంద్రబాబుపై వైసీపీ కామెంట్స్
కరోనాతో రాజధాని మార్పు గురించి ప్రస్తుతం ఆలోచించే పరిస్థితి లేదని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
'రాజధాని మార్పు గురించి ఆలోచించే పరిస్థితి లేదు'
గనుల్లో లభ్యమవుతున్నది బాక్సైట్ కాదని కేంద్రం తేల్చాకనే....లాటరైట్ గనులకు అనుమతులిచ్చామని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నిరాధారణ ఆరోపణలు చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. ఎంపీ రఘరామకృష్ణరాజు వెనక ఉన్నదెవరో ప్రజలందరికీ తెలుసని.. తెదేపా అధినేత చంద్రబాబే ఆయనతో రాజకీయం చేయిస్తున్నారన్నారంటూ ఆరోపించారు.
ఇవీచదవండి: నాకు ప్రాణహాని ఉంది.... రక్షణ కల్పించండి: ఎంపీ రఘురామకృష్ణరాజు
TAGGED:
చంద్రబాబుపై వైసీపీ కామెంట్స్