ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రాపకం కోసం నిమ్మగడ్డ పనిచేస్తున్నారని ఆరోపించారు. ఏకగ్రీవాలను కొన్ని పార్టీలు హేళన చేస్తున్నాయన్నారు. పదవీ విరమణలోపు ఎన్నికలు పెట్టాలనే లక్ష్యంతో నిమ్మగడ్డ ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల కమిషనర్ ఇంకా ఎంతకాలం పదవిలో ఉంటారు? అని ప్రశ్నించారు.
'ఎస్ఈసీ వల్ల ఇబ్బంది పడిన అధికారులకు అండగా ఉంటాం' - ఏపీ పంచాయతీ ఎన్నికలు
ఏపీ ఎస్ఈసీ వల్ల ఇబ్బంది పడిన అధికారులకు అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ఎస్ఈసీ తీసుకునే క్రమశిక్షణా చర్యలను తర్వాత రద్దు చేస్తామన్నారు.
'ఎస్ఈసీ వల్ల ఇబ్బంది పడిన అధికారులకు అండగా ఉంటాం'
ఎస్ఈసీ తీసుకునే క్రమశిక్షణా చర్యలను తర్వాత రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఎస్‌ఈసీ వల్ల ఇబ్బంది పడిన అధికారులకు అండగా ఉంటామని తేల్చి చెప్పారు. చంద్రబాబు నామినేషన్లు ఎక్కువ వేయమనడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారులపై ఎస్‌ఈసీ లేఖలను వెనక్కి పంపామని మంత్రి వెల్లడించారు.
ఇవీచూడండి:'సమన్వయంతో పని చేద్దాం.. ఎన్నికలు సజావుగా నిర్వహిద్దాం'