ప్రజాబలం లేకనే దొంగ ఓట్లు అంటూ తెదేపా నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపాను నేరుగా ఎదుర్కోలేకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రణాళికబద్ధంగానే దొంగ ఓట్ల నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. పుణ్యక్షేత్రమైన తిరుపతికి ఎక్కడెక్కడ్నుంచో భక్తులు వస్తుంటారన్న ఆయన.. బస్సుల్లోని ప్రయాణికులపై దొంగ ఓటర్లు అనే ముద్ర వేస్తున్నారని చెప్పారు.
ప్రజాబలం లేకనే దొంగ ఓట్లు అంటూ ఆరోపణలు: పెద్దిరెడ్డి
తెదేపా నేతలపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామంచంద్రారెడ్డి మండిపడ్డారు. ప్రజాబలం లేకే దొంగ ఓట్లు అంటూ వైకాపాపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష నేతల వైఖరిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.
దొంగఓట్లపై మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు, తిరుపతి ఉప ఎన్నిక
విపక్ష నేతల వైఖరిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. తనని వీరప్పన్‌తో పోలుస్తూ లోకేశ్ ట్వీట్ చేశారని.. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటానని సవాల్ విసిరారు. నారా లోకేశ్‌కు ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని దుయ్యబట్టారు. ఇతర పార్టీలో గెలిచిన వారికి పదవులు ఇచ్చింది ఎవరని..? పెద్దిరెడ్డి ప్రశ్నించారు. తెదేపా తప్పులు సరిదిద్దుకుని ప్రజల మన్నన పొందేందుకు యత్నించాలని హితవు పలికారు.