తెలంగాణ

telangana

ETV Bharat / city

విజయవాడలో తెదేపాకు నాలుగైదు సీట్లు వచ్చే పరిస్థితి లేదు: మంత్రి పెద్దిరెడ్డి

ఏపీలోని విజయవాడలో తెదేపాకు నాలుగైదు సీట్లు వచ్చే పరిస్థితి లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికలపై కృష్ణా జిల్లా నేతలతో సమావేశం అనంతరం మాట్లాడిన ఆయన.. వైకాపాను విమర్శించే ముందు సొంత పార్టీలోని విభేదాలపై దృష్టి సారించాలని హితవు పలికారు.

విజయవాడలో తెదేపాకు నాలుగైదు సీట్లు వచ్చే పరిస్థితి లేదు: మంత్రి పెద్దిరెడ్డి
విజయవాడలో తెదేపాకు నాలుగైదు సీట్లు వచ్చే పరిస్థితి లేదు: మంత్రి పెద్దిరెడ్డి

By

Published : Mar 6, 2021, 5:26 PM IST

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో తెదేపా అధినేత చంద్రబాబు చేసిన విమర్శలను రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని ఖండించారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో మున్సిపల్‌ ఎన్నికలపై కృష్ణా జిల్లా ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి... విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లతో పాటు అన్ని మున్సిపాలిటీలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో తెదేపాకి నాలుగైదు సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని, ఆ పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయని విమర్శించారు. తమని విమర్శించే ముందు చంద్రబాబు తన పార్టీ సంగతి చూసుకోవాలన్నారు.

రాష్ట్రంలో పరిస్థితులు బాలకృష్ణకు తెలియవు: మంత్రి కొడాలి

విశాఖ ఉక్కు విషయంలో మోదీని ప్రశ్నించలేక ముఖ్యమంత్రి జగన్​పై విమర్శలు చేస్తున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. బాలకృష్ణ షూటింగుల కోసం ఇతర దేశాలు, రాష్ట్రాలు తిరుగుతారని, రాష్ట్రంలో పరిస్థితులు ఆయనకు తెలియవని విమర్శించారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప ఏమీ చేయలేరని ఎద్దేవా చేశారు. బాలకృష్ణ ఆటలో అరటిపండు లాంటి వాడని వ్యాఖ్యానించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని.. జగన్‌ ప్రభుత్వాన్ని మోదీ ప్రభుత్వం ఎలా నియంత్రిస్తుందో చెప్పాలని విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నించారు.

విజయవాడలో తెదేపాకు నాలుగైదు సీట్లు వచ్చే పరిస్థితి లేదు: మంత్రి పెద్దిరెడ్డి

ఇదీ చదవండి: నన్ను విమర్శిస్తే ఊరుకోను.. బాలకృష్ణ హెచ్చరికలు

ABOUT THE AUTHOR

...view details