తిరుమల శ్రీవారిని సినీ నటుడు, భాజపా నేత బాబూ మోహన్ దర్శించుకున్నారు.ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటుడు బాబూమోహన్ - tirumala latest news
తిరుమల శ్రీవారిని సినీనటుడు బాబూ మోహన్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటుడు బాబూమోహన్
దుబ్బాక విజయం స్ఫూర్తితో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపా జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ నేత బాబూ మోహన్ ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాకలో భాజాపా గెలవడం కేసీఆర్ని ఓడించినట్లేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపానే అధికారంలోకి వస్తుందన్నారు.
ఇదీ చూడండి: ప్రజల గొంతు వినిపించే అవకాశం ఇవ్వండి: రేవంత్రెడ్డి
Last Updated : Nov 23, 2020, 8:01 PM IST