రాయలసీమకు నీరిచ్చేందుకు కృషి చేస్తామని గతంలో కేసీఆర్(KCR) స్వయంగా జగన్(CM Jagan)తోనే చెప్పారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి(Peddi Reddy) అన్నారు. కేసీఆర్ మాటలకు తానే ప్రత్యక్ష సాక్షినని మంత్రి అన్నారు. రాయలసీమకు సాగు, తాగునీరు ఇచ్చేలా చూడాలని కేసీఆరే చెప్పారని ఈ సందర్భంగా పెద్దిరెడ్డి(Peddi Reddy) స్పష్టం చేశారు.
PEDDI REDDY: 'కేసీఆరే స్వయంగా జగన్కు చెప్పారు.. నేనే ప్రత్యక్ష సాక్షిని' - Peddi Reddy latest news
రాయలసీమకు నీళ్లివ్వాలని కేసీఆరే(KCR)స్వయంగా జగన్(CM Jagan)కు చెప్పారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి(Peddi Reddy) అన్నారు. కేసీఆర్ మాటలకు తానే ప్రత్యక్ష సాక్షినని ఆయన చెప్పారు.
'కేసీఆరే స్వయంగా జగన్కు చెప్పారు.. నేనే ప్రత్యక్ష సాక్షిని'
ఏపీకి రావాల్సిన నీటి వాటాను మాత్రమే వాడుకుంటున్నామన్న పెద్దిరెడ్డి..ఎక్కువ నీరు వాడుకోవాలని జగన్ ప్రభుత్వం ఆలోచించదని వివరించారు. తెలంగాణకు వైఎస్ ఎంతో సేవ చేశారని కేసీఆర్ పొగిడారని.. మంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణ మంత్రులు ఇలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
ఇదీ చదవండి:WATER DISPUTES: కేసీఆర్కు కేంద్రజలశక్తి మంత్రి ఫోన్.. 'రాయలసీమ'కు కృష్ణాబోర్డు బృందం