కరోనా వైరస్ వ్యాప్తి వల్ల రాష్ట్ర ప్రజలంతా ఆందోళన చెందుతున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. తెలంగాణలోని ప్రధాన దేవాలయాల్లో భక్తుల రద్దీ తగ్గిందని తెలిపారు. ఈ ఏడాది ఉగాది పంచాంగ పఠనం దేవాదాయ శాఖ కార్యాలయంలో ఉంటుందని మంత్రి వెల్లడించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండి పంచాంగ శ్రవణం వీక్షించాలని కోరారు.
'ఈ ఉగాదికి ఇంట్లోనే పంచాంగ శ్రవణం వీక్షించండి' - భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలకు భక్తులకు నో ఎంట్రీ
ఈ ఉగాది దేవాదాయ శాఖ కార్యాలయంలో ఉగాది పంచాంగ పఠనం ఉంటుంది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. రాష్ట్రంలో అన్ని ప్రధాన ఆలయాలను మూసివేసినట్లు ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
'ఈ ఉగాదికి ఇళ్లలోనే పంచాంగ శ్రవణం వీక్షించండి'
భద్రాద్రిలో యథావిధిగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తామని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అర్చకుల సమక్షంలోనే ఈ వేడుక జరుగుతుందని, భక్తులెవరికి అనుమతి లేదని స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయం మేరకే నవమి ఉత్సవం జరుపుతున్నట్లు చెప్పారు. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న వారికి తలంబ్రాలు ఇంటికే పంపిస్తామని వెల్లడించారు.
- ఇదీ చూడండి :బోసిపోయిన భద్రాద్రి..నిర్మానుష్యంగా రామయ్య ఆలయం