న్యాయ సలహా, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కేంద్ర ఆర్డినెన్స్ అమలుపై ముందుకు వెళ్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఒప్పంద సేద్యం, మార్కెటింగ్ చట్టాలకు సంబంధించిన కేంద్ర ఆర్డినెన్స్‌పై మార్కెటింగ్ ఉన్నతాధికారులు, కేంద్ర ప్రతినిధులతో హైదరాబాద్‌లో మంత్రి సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రతినిధులు డాక్టర్ అనిల్ కుమార్, లక్ష్మీదేవి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, అదనపు సంచాలకులు లక్ష్మణుడు, రవికుమార్, పర్యవేక్షక ఇంజినీరు ఉమామహేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
అలా అయితే ఆర్థిక వనరులు కోల్పోతాం
ఒప్పంద సేద్యం, మార్కెట్ల చట్టాలు, కేంద్ర ఆర్డినెన్స్, ఇతర అంశాలపై విస్తృతంగా చర్చించారు. కేంద్ర ఆర్డినెన్స్ అమలు చేసేందుకు ఆదేశాలివ్వాలని కేంద్ర ప్రతినిధులు మంత్రిని కోరారు. కేంద్ర చట్టాలతో స్థానిక మార్కెట్లు ఆర్థిక వనరులు కోల్పోతాయని మంత్రి ప్రస్తావించారు. ఆర్థిక వనరులు పెంపొందించుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం... కొనడానికి మద్దతు ధరకు కొనుగోలు చేసే పంటలు మార్కెట్ యార్డుల్లో మార్కెట్ కమిటీలచే కొనుగోలు అనుమతికి ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నామని ప్రకటించారు.