తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఖరీఫ్​లో అవసరానికి మించి విత్తనాలు సిద్ధం' - minister niranjan reddy

దేశానికే తలమానికంగా తెలంగాణ విత్తన రంగం నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం 18.287 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఇవి అవసరానికి మించిన విత్తన నిల్వలు అని తెలిపారు. వానా కాలం సాగు-విత్తన లభ్యతపై సమీక్ష నిర్వహించారు.

minister niranjan reddy, kharif season, kharif in telangana
మంత్రి నిరంజన్ రెడ్డి, ఖరీఫ్ సాగు, తెలంగాణలో ఖరీఫ్ సాగు

By

Published : May 25, 2021, 3:21 PM IST

రాష్ట్రంలో వానాకాలం సాగు అంచనా కోటి 40 లక్షల ఎకరాల విస్తీర్ణాన్ని తెలంగాణ సర్కార్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనికి 13.06 లక్షల క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలు అవసరమని అంచనా వేసింది. హైదరాబాద్ హాకా భవన్ లో ఈ ఏడాది వానా కాలం సాగు - విత్తన లభ్యతపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష చేశారు.

జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న వానా కాలం సీజన్ ఏర్పాట్లకు సంబంధించి విత్తనాలు, రసాయన ఎరువుల లభ్యతలపై విస్తృతంగా చర్చించారు. దేశానికే తలమానికంగా తెలంగాణ విత్తన రంగం నిలిచిందని మంత్రి అన్నారు. ఇప్పుడు 18.287 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఇవి అవసరానికి మించిన విత్తన నిల్వలు అని చెప్పారు. 70.05 లక్షల ఎకరాల్లో పత్తి, 20 లక్షల ఎకరాల్లో కంది, 41 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా వేశామని తెలిపారు. వరికి ప్రత్యామ్నాయంగా రైతులు మార్కెట్​లో డిమాండ్ ఉన్న.. కంది, పత్తి సాగును మరింతగా పెంచాలని సూచించారు. తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా డిమాండ్ ఉందని అన్నారు.

జిల్లాల్లో ఇప్పటికే 59.32 లక్షల పత్తి విత్తనాలు ఉండగా.. మిగిలిన విత్తనాలను క్లస్టర్ల వారిగా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో ఉన్న డిమాండ్ ప్రకారం విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అకాల వర్షాల వల్ల నాణ్యమైన సోయాబీన్ విత్తనం అందుబాటులో లేనందున ఆ విత్తనాన్ని ప్రభుత్వం సరఫరా చేయడం లేదని స్పష్టం చేశారు. రైతులు దీనికి ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని సూచించారు. వచ్చే యాసంగిలో విచ్చలవిడిగా వరి సాగు చేయవద్దని అన్నారు. వేరుశనగ, నువ్వులు, ఆవాలు తదితర ప్రత్యామ్నాయ పంటలు వేయాలని‌ కోరారు.

పప్పు దినుసుల పంటల సాగు ప్రోత్సహించే దిశగా అంతర పంటగా వేసేందుకు ఉచితంగా ఎకరాకు రెండు కిలోల కంది విత్తనాలు ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు. డీలర్ల వద్ద రైతులు కొన్న ప్రతి దానికి రశీదులు తీసుకోవాలని తెలిపారు. లైసెన్స్ లేని వారి వద్ద విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనకూడదని.. క్షేత్రస్థాయిలో రైతులకు అర్ధమయ్యేలా చెప్పాలని ఆదేశాలు జారీ చేశారు. పత్తిలో నకిలీ విత్తనాల విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details