తెలంగాణ

telangana

ETV Bharat / city

'వ్యవసాయ రంగంలో యాంత్రికాభివృద్ధికి ప్రభుత్వం కృషి'

రాష్ట్రంలో వ్యవసాయరంగంలో యాంత్రీకరణ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నిరంజన్​రెడ్డి తెలిపారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. నాట్ల నుంచి పంట కోత వరకు యంత్రాల వినియోగం పెరిగిన తరుణంలో రైతులకు యంత్రాలను అందుబాటులోకి ఉంచేందుకు అన్ని రకాల చర్యలు ప్రభుత్వం చేపట్టిందన్నారు.

By

Published : Sep 9, 2020, 11:27 AM IST

వ్యవసాయానికి సంబంధించి సమగ్ర ప్రణాళిక రచించాలంటే మన దగ్గర సమగ్ర సమాచారం ఉండాలి. ఆ సమాచారం కోసమే నియంత్రిత సాగులో భాగంగా వ్యవసాయ శాఖ అధికారులు నిన్నటి వరకు సేకరించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో 1,40,50,000 వేల ఎకరాల పంట సాగులో ఉంది. యాసంగికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక్కొ గ్రామంలో ఎన్ని రొటావేటర్లు ఉన్నాయి. ఎన్ని కల్టివేటర్లు ఉన్నాయి? ఎన్ని ట్రాకర్లు ఉన్నాయి? ఎన్ని స్ప్రేయర్లు ఉన్నాయి? అనే సమాచారం కోసం గ్రామస్థాయిలో సర్వే చేయిస్తున్నాం. బడ్జెట్​ సమావేశాలకు నాటికి చర్చించి నిధులు పెట్టుకోని.. కావాల్సిన యంత్ర పరికాలను నిర్థరణ చేసుకుంటే వాటిని విదేశాల నుంచి కాకుండా స్వదేశంలోనే.. మన రాష్ట్రంలో ఎంతో మంది యువత నూతన యంత్రాల ఆవిష్కరణ చేస్తున్నారు. వారికి ఉపాధి కల్పనతో పాటు వారిని ప్రోత్సహించి వ్యవసాయ రంగంలో యాంత్రీకరణను పెంపొందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. - సింగిెరెడ్డి నిరంజన్​రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి.

'వ్యవసాయ రంగంలో యాంత్రికాభివృద్ధికి ప్రభుత్వం కృషి'

ABOUT THE AUTHOR

...view details