తెలంగాణ

telangana

ETV Bharat / city

నీళ్లమీద మాకున్న చిత్తశుద్ధి వారికెక్కడిది..: నిరంజన్​రెడ్డి - జల వివాదాలపై స్పందించిన నిరంజన్​రెడ్డి

కృష్ణాజలాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని మంత్రి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ముందుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్‌కు అంత సులువు కాదని తెలిపారు.

MINISTER NIRANJAN REDDY FIRES ON OPPOSITION LEADERS OVER WATER DISPUTES
నీళ్లమీద మాకున్న చిత్తశుద్ధి వారికెక్కడిది..: నిరంజన్​రెడ్డి

By

Published : Aug 4, 2020, 9:55 PM IST

కృష్ణాజలాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని... మంత్రి నిరంజన్‌ రెడ్డి పేర్కొన్నారు. నీళ్లు తరలించుకుపోతుంటే కావలి కాసిన వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ వాదనను ఇప్పటికే పలు వేదికలపై వినిపించామన్న ఆయన... వాళ్లు కావాలన్నప్పుడే వెళ్లాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ముందుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్‌కు అంత సులువు కాదని తెలిపారు. పాలమూరు - రంగారెడ్డి పనులు ఇప్పటికే 70 శాతం పూర్తయ్యాయన్న మంత్రి... కేసులు లేకపోయి ఉంటే ఇప్పటికే మొత్తం పూర్తయ్యేదని వెల్లడించారు.

నీళ్లమీద మాకున్న చిత్తశుద్ధి వారికెక్కడిది..: నిరంజన్​రెడ్డి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details