తెలంగాణ

telangana

ETV Bharat / city

Niranjan Reddy Comments: భాజపా బెదిరిస్తోంది.. ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతోంది.. - సీఎం కేసీఆర్​పై భాజపా నేతల వ్యాఖ్యలు

ధాన్యం కొనుగోలు విషయంలో అధికార పార్టీకి, భాజపా నేతలకు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్​పై భాజపా నేతలు చేసిన వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్​రెడ్డి మండిపడ్డారు. ధాన్యం సమస్యకు పరిష్కారం చూపమంటే ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Minister Niranjan Reddy fire on bjp leaders for Comments on cm kcr
Minister Niranjan Reddy fire on bjp leaders for Comments on cm kcr

By

Published : Nov 9, 2021, 5:43 PM IST

Updated : Nov 9, 2021, 10:35 PM IST

భాజపా బెదిరిస్తోంది.. ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతోంది..

ధాన్యం సేకరణలో కేంద్రానిది ముమ్మాటికీ వైఫల్యమేనని మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తన అసమర్థతను ఒప్పుకోవాలన్నారు. ధాన్యం కొనలేమంటున్న కేంద్రం.. ఎందుకు కొనరో నేరుగా, వివరంగా ప్రజలకు చెప్పాలని డిమాండ్​ చేశారు. ధాన్యం సమస్యకు పరిష్కారం చూపమంటే ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. నిజానికి భాజపా నేతలే దేశంలో అందరినీ బెదిరిస్తున్నారని నిరంజన్‌రెడ్డి ఆరోపించారు.

మెడమీద కత్తి పెట్టింది కేంద్రమే..

ధాన్యం సేకరణ, ఆహార పంపిణీ కేంద్ర ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ఉద్ఘాటించారు. ధాన్యం సొమ్మును రైతులకు తాము వారం రోజుల్లోనే చెలిస్తుంటే.. కేంద్రం మాత్రం రాష్ట్రానికి 6 నెలల తర్వాత ఇస్తోందని ఆరోపించారు. పంజాబ్‌లో కొన్నట్లే తెలంగాణలోనూ మొత్తం ధాన్యం కొనాలని డిమాండ్​ చేశారు. దశాబ్దాల హరితవిప్లవం వల్ల పంజాబ్‌లో వరి ఉత్పత్తి పెరిగింది.. అలాంటి కేంద్ర ప్రోత్సాహం లేకుండానే వరిలో అగ్రస్థానానికి తెలంగాణ ఎదిగిందని స్పష్టం చేశారు. కేంద్రం తనకు నచ్చని రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతోందన్నారు. రైతులకు మెడమీద కత్తి పెట్టింది కేంద్రప్రభుత్వమేనని మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు.

పరిష్కారం అడిగితే ఎదురుదాడా..?

"3 లక్షల కోట్ల టన్నుల బియ్యం వృథాగా ఉన్నాయని కేంద్రమంత్రి చెప్పారు. ఎఫ్‌సీఐ వద్ద బియ్యం నిల్వలు భారీగా ఉన్నాయని నితిన్​ గడ్కరీ అన్నారు. రైతులను ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించాలని కేంద్రమంత్రి చెప్పారు. ధాన్యం కొనలేమని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖల ద్వారా చెప్పింది. ధాన్యాన్ని కొనలేమని చెప్పిన కేంద్రం.. అదే విషయాన్ని నేరుగా ప్రజలకు చెప్పాలి. తెలంగాణలో రైతులు యాసంగి బియ్యాన్ని పూర్తిగా అమ్ముతారు. వేసవి ఉష్ణోగ్రతల వల్లే యాసంగి బియ్యంలో నూకలు ఎక్కువగా వస్తాయి. ఇది అందరికి తెలిసిన విషయమే. ఇన్నాళ్లు కేంద్రం బాయిల్డ్‌ రైసును తీసుకోలేదా?. మరి ఇప్పుడు ఎందుకు తీసుకోం అంటున్నారు. ఒకవేళ బాయిల్డ్​ రైస్​ తినే వాళ్లు దేశంలో తగ్గిపోతున్నారంటే.. అందుకు పరిష్కారం చూపెట్టాలి కదా. అలా చెప్పకుండా మధ్యలోనే చేతులెత్తేస్తే ఎలా. ధాన్యం సేకరణలో కేంద్రానిది ముమ్మాటికీ వైఫల్యమే. కేంద్ర ప్రభుత్వం తన అసమర్థతను ఒప్పుకోవాలి. ధాన్యం కొనలేమంటున్న కేంద్రం నేరుగా ప్రజలకు చెప్పాలి. భాజపా నేతలు దేశంలో అందరినీ బెదిరిస్తున్నారు. ధాన్యం సమస్యకు పరిష్కారం చూపమంటే ఎదురుదాడి చేస్తున్నారు." - సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి


ఇదీ చూడండి:

Last Updated : Nov 9, 2021, 10:35 PM IST

ABOUT THE AUTHOR

...view details