తెలంగాణ

telangana

ETV Bharat / city

Minister Niranjan Reddy : 'కేంద్ర మంత్రే అలా మాట్లాడటం బాధాకరం' - తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు

Minister Niranjan Reddy : ధాన్యం కొనుగోళ్లపై సాక్షాత్తు కేంద్ర మంత్రే వాస్తవ విరుద్ధంగా మాట్లాడటమనేది బాధాకరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుల ప్రయోజనాలు నెరవేరే వరకు తమ పోరాటం ఆగదని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోళ్ల గురించి కేంద్ర మంత్రులతో మాట్లాడటానికి మంత్రులు గంగుల, పువ్వాడలతో కలిసి ఇవాళ దిల్లీకి వెళ్తామని చెప్పారు.

Minister Niranjan Reddy
Minister Niranjan Reddy

By

Published : Mar 22, 2022, 2:24 PM IST

కేంద్ర మంత్రే అలా మాట్లాడటం బాధాకరం

Minister Niranjan Reddy : రైతుల ప్రయోజనాలు నెరవేరడం కోసం ఆఖరి నిమిషం వరకు పోరాడతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు గంగుల కమలాకర్‌, పువ్వాడ అజయ్‌తో కలిసి సాయంత్రం దిల్లీ వెళ్లనున్నట్లు తెలిపారు.

కొనుగోళ్లు జరిపే వరకు పోరాటం ఆగదు..

Niranjan Reddy About Paddy Procurement :కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసి ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తామని నిరంజన్ రెడ్డి చెప్పారు. కేంద్రం స్పందనకు అనుగుణంగా భవిష్యత్‌ కార్యాచరణ చేపడతామని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లు చేసే వరకు ప్రజాస్వామ్యయుతంగా పోరాడతామని వెల్లడించారు. రాష్ట్రం సిద్ధం చేసిన బియ్యాన్ని తీసుకెళ్లకుండా.. ఆరోపణలు చేయడం కేంద్రమంత్రికి తగదని వ్యాఖ్యానించారు.

కేంద్ర మంత్రే అబద్ధమాడితే..

"సాక్షాత్తు కేంద్ర మంత్రే వాస్తవ విరుద్ధంగా మాట్లాడటం అనేది బాధాకరం. గత రెండు నెలల నుంచి పది లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపించడానికి మేం రెడీగా ఉంచాం. మాకు రైల్వే రేకులు చూపించండి.. గోదాములు చూపిస్తే పంపిస్తామని చెప్పాం. కానీ కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో ఫర్టిలైజర్ ఒత్తిడి వల్ల రేకులు డైవర్ట్ చేయాల్సి వచ్చింది. అందుకే తెలంగాణకు ఇవ్వలేకపోయామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఇప్పుడేమో కేంద్రం తీసుకుంటామని చెప్పినా.. తెలంగాణయే ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. ఇది ఎంత వరకు సమంజసం. మా వద్ద బియ్యాన్ని ఎందుకు ఉంచుకుంటాం. దాంతో మాకేం లాభం వస్తుంది."

- నిరంజన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి

ABOUT THE AUTHOR

...view details