ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానికి కావాల్సిన అన్ని హంగులు విశాఖకు ఉన్నాయని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ ఏయూలో క్రీడా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మంత్రి మాట్లాడారు. విశాఖపట్నం రాజధాని అని ఎప్పటి నుంచో చెబుతున్నట్టు గుర్తు చేశారు. గతంలోనే ఈ నిర్ణయం తీసుకుంటే విశాఖపట్నం ఎంతో అభివృద్ధి చెందేదని వ్యాఖ్యానించారు.
Avanthi on Visakha: 'విశాఖపట్నమే ఏపీ రాజధానిగా కేంద్రం నుంచి సంకేతాలు' - vishakapatnam latest news
తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత పరిపాలనా రాజధానికి కావాల్సిన అన్ని హంగులు విశాఖకు ఉన్నాయని ఏపీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ ఏయూలో క్రీడా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మంత్రి మాట్లాడారు.

avanthi on visakha: 'విశాఖపట్నమే రాష్ట్ర రాజధానిగా కేంద్రం నుంచి సంకేతాలు'
విశాఖను పరిపాలనా రాజధానిగా చేసినంత మాత్రాన అమరావతి, కర్నూలు ప్రాంతాలను పట్టించుకోకుండా ఉండే ప్రసక్తే లేదన్నారు. విశాఖను రాష్ట్ర రాజధానిగా కేంద్రం పరిగణించిన సంకేతాలు రావడం సంతోషకరమని చెప్పారు. ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి.. తగిన శిక్షణతో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: Harish Rao: 'ప్రజాసమస్యల కోసమే ఈటల రాజీనామా చేశారా?.. ఆలోచించండి'