రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన రెవెన్యూ చట్టం ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు లభిస్తాయని రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలో సుమారు రూ.3.60 కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
అభివృద్ధి పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన - అభివృద్ధి పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన
ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని, లబ్ధి పొందాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు.
అభివృద్ధి పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. కల్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ఇటీవల మృతి చెందిన మున్సిపల్ తెరాస అధ్యక్షుడు చర్ల ఆంజనేయులు సంతాప సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి, మంద సంజీవరెడ్డి పాల్గొన్నారు.