తెలంగాణ

telangana

ETV Bharat / city

Minister Mallareddy: 'అందుకే ఎన్​కౌంటర్​ చేయాలన్నా.. వేరే ఉద్దేశంతో కాదు..' - 'అందుకే ఎన్​కౌంటర్​ చేయాలన్నా.. వేరే ఉద్దేశంతో కాదు..'

ఆరేళ్ల చిన్నారిని హత్యాచారం చేసిన నిందితుని విషయంలో తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ ఇచ్చారు. కోపంతో ఊగిపోతూ చేసిన సంచలన వ్యాఖ్యాల వెనుక తన అసలు ఉద్దేశాన్ని వివరించారు.

Minister Mallareddy explained his statements on saidabad culprit encounter
Minister Mallareddy explained his statements on saidabad culprit encounter

By

Published : Sep 14, 2021, 9:37 PM IST

Updated : Sep 14, 2021, 10:22 PM IST

సైదాబాద్ ఘటనలో నిందితుడిని ఎన్​కౌంటర్ చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి మల్లారెడ్డి వివరణ ఇచ్చారు. చిన్నారికి జరిగిన దారుణాన్ని విని తట్టుకోలేకపోయానని తెలిపారు. ఇలాంటి ఘాతుకాలకు పాల్పడాలంటే వణుకు పుట్టాలనే ఉద్దేశంతోనే ఎన్​కౌంటర్ చేయాలన్నానని తెలిపారు. చట్టాల్లో మార్పులు తెచ్చి... ఇటువంటి పైశాచికులకు కఠిన శిక్షలు పడేలా చూడాలనేదే తన ఉద్దేశమని.. మరే ఉద్దేశం లేదని మంత్రి పేర్కొన్నారు.

'అందుకే ఎన్​కౌంటర్​ చేయాలన్నా.. వేరే ఉద్దేశంతో కాదు..'

ఎన్​కౌంటర్​ చేయాల్సిందే..

అంతకు ముందు మేడ్చల్ పట్టణంలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి... సమావేశం ముగించుకుని వెళ్లేటప్పుడు మీడియా అడిగిన ప్రశ్నలకు గానూ ఆసక్తికర సమాధానాలతో స్పందించారు. ప్రశ్న వినగానే కోపంతో ఊగిపోయిన మంత్రి.. నిందితున్ని ఎన్​కౌంటర్​ చేయాల్సిందేనని ఉద్ఘాటించారు. కచ్చితంగా ఆ నిందితున్ని పట్టుకుని ఎన్​కౌంటర్​ చేస్తామన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. త్వరలోనే బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తామని తెలిపారు.

ఎన్​కౌంటర్​ చేయాల్సిందే..

సంబంధిత కథనం..

Last Updated : Sep 14, 2021, 10:22 PM IST

ABOUT THE AUTHOR

...view details