మేడ్చల్ జిల్లా కీసర మండలం చిర్యాలలో రెండు పడక గదుల ఇళ్ల పత్రాలు మంత్రి మల్లారెడ్డి పంపిణీ చేశారు. 61 మంది దరఖాస్తు చేసుకోగా... 40 ఇళ్లు మాత్రమే ఉండటం వల్ల లక్కీ డ్రా తీసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. లక్కీ డ్రాలో పేరు రాలేదని... శ్రీకాంత్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు అప్రమత్తమై... అతడిని స్టేషన్కు తరలించారు.
'డబుల్' ఇల్లు ఇవ్వలేదని మంత్రి ఎదుటే ఆత్మహత్యాయత్నం - రెండు పడక గదుల ఇళ్లు పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్ జిల్లా కీసర మండలం చిర్యాలలో మంత్రి మల్లారెడ్డి... లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇళ్లు పంపిణీ చేశారు. ఇళ్లు రాలేదని మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు.
డబుల్ బెడ్ రూం రాలేదని వ్యక్తి ఆత్మహత్యాయత్నం