తెలంగాణ

telangana

ETV Bharat / city

హరితహారంలో తలసాని, మల్లారెడ్డి, ప్రియాంక వర్గీస్ - మేడ్చల్​లో మంత్రి తలసాని హరితహారం

మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో నిర్వహించిన హరితహారంలో మంత్రులు తలసాని శ్రీనివాస్​ యాదవ్​, మల్లారెడ్డి పాల్గొన్నారు. హరితహారాన్ని విజయవంతం చేసిన కౌన్సిలర్లకు అవార్డులు ఇచ్చేలా చూస్తామని తలసాని హామీ ఇచ్చారు. లాక్​డౌన్​పై సీఎం కేసీఆరే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.

మేడ్చల్​లో హరితహారం
మేడ్చల్​లో హరితహారం

By

Published : Jun 29, 2020, 4:23 PM IST

కరోనా వ్యాప్తిని తెలంగాణ ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొంటోందని పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల పరిధిలోని కండ్లకోయ జాతీయ రహదారి వద్ద నిర్వహించిన హరితహారంలో మంత్రి మల్లారెడ్డి, సీఎం కార్యాలయ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్​తో కలిసి మొక్కలు నాటారు. ప్రజలు, అధికారుల సమన్వయంతోనే హరితహారం విజయవంతమవుతుందని తలసాని అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్​లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి లాక్​డౌన్​పై నిర్ణయం తీసుకుంటారని తలసాని స్పష్టం చేశారు. హరితహారాన్ని విజయవంతం చేసిన కౌన్సిలర్లకు ప్రత్యేక అవార్డులు ఇచ్చేలా చూస్తామన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని హరిత, ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి ఉద్ఘాటించారు.

ఇవీ చూడండి:టిక్​టాక్ కోసం విద్యుత్ స్తంభం ఎక్కాడు.. ఆ తర్వాత?

ABOUT THE AUTHOR

...view details