'డబుల్ బెడ్ రూం లబ్దిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉండాలి' - 'డబుల్ బెడ్ రూంల లబ్దిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉండాలి'
15:31 September 17
'డబుల్ బెడ్ రూం లబ్దిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉండాలి'
హైదరాబాద్‌లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిసరాల్లో పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీలో ఇళ్ల నిర్మాణంపై పురపాలక, గృహనిర్మాణశాఖ ఉన్నతాధికారులతో మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీలో రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణ పురోగతిపై చర్చించారు. లక్ష ఇళ్లు త్వరలోనే పూర్తవుతాయని మంత్రులకు అధికారులు వివరించారు.
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ త్వరితగతిన చేపట్టాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కలెక్టర్లతో కలిసి ఎంపిక చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌కు సూచించారు. గతంలో అందినవారికి మరోసారి ఇళ్లు రాకుండా చూడాలన్నారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండాలన్నారు. జీహెచ్ఎంసీ కోసం ఇతర జిల్లాల పరిధిలో నిర్మిస్తున్న ఇండ్లలో పదిశాతం లేదా వెయ్యికి మించకుండా స్థానికులకు ఇళ్లు ఇవ్వాలని తెలిపారు. ఆ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని మంత్రి సూచించారు.
ఇదీ చూడండి: భట్టికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు చూపిస్తున్న తలసాని..
TAGGED:
KTR PRASHANT REDDY SAMIKSHA