'ప్రజలంతా ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలి' - municipal minister ktr
విజయాలను చేకూర్చే విజయ దశమి పర్వదినాన్ని ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ దసరా శుభాకాంక్షలు
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. విజయాలను చేకూర్చే విజయ దశమి పర్వదినాన ప్రజలంతా ఆనందంగా ఉండాలని కోరుకున్నారు. అందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు మంత్రి ట్వీట్ చేశారు.