తెలంగాణ

telangana

ETV Bharat / city

KTR Birthday: 'బొకేలు, కేకులొద్దు.. ఈసారి దివ్యాంగులకు బైకులిస్తా..' - గిఫ్ట్ ఏ స్మైల్

ఈ నెల 24న మంత్రి కేటీఆర్​ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు తెరాస నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. గతేడాది.. గిఫ్ట్​ ఏ స్మైల్​లో భాగంగా అంబులెన్సులు అందించగా... ఈసారి దివ్యాంగులకు ద్విచక్రవాహనాలు పంపింణీ చేయనున్నట్లు మంత్రి కేటీఆర్​ తెలిపారు. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ముక్కోటి వృక్షార్చణ నిర్వహించనున్నారు.

minister ktr will distribute custom made vehicles to100 differently abled on his birthday
minister ktr will distribute custom made vehicles to100 differently abled on his birthday

By

Published : Jul 22, 2021, 2:17 PM IST

తన పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్​లో భాగంగా వంద మంది దివ్యాంగులకు ప్రత్యేకమైన ద్విచక్రవాహనాలను అందించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. గతేడాది... గిఫ్ట్ ఏ స్మైల్​లో భాగంగా ఆరు అంబులెన్స్​లను విరాళంగా ఇచ్చానన్న కేటీఆర్​... తెరాస ప్రజాప్రతినిధులు, నేతలు మొత్తంగా 90 అంబులెన్స్​లను విరాళం ఇచ్చారని పేర్కొన్నారు.

ముక్కోటి వృక్షార్చనకు పిలుపు...

ఈ నెల 24వ తేదీన తన జన్మదినం సందర్భంగా అవసరం ఉన్న వారికి వ్యక్తిగతంగా సాయం అందించాలని కోరారు. అదే రోజున నిర్వహిస్తోన్న ముక్కోటి వృక్షార్చనలో ప్రతి ఒక్కరు పాల్గొని మొక్కలు నాటాలని తెరాస నేతలు, అనుచరులు, అభిమానులకు కేటీఆర్​ పిలుపునిచ్చారు. తన జన్మదినం రోజున బొకేలు, కేకులు, హోర్డింగుల కోసం వృథాగా డబ్బు ఖర్చు చేయవద్దని కేటీఆర్ సూచించారు.

కేటీఆర్​ అడుగుజాడల్లోనే మేం కూడా...

మంత్రి కేటీఆర్​ పుట్టినరోజు సందర్భంగా తాము కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటామని తెరాస నేతలు ముందుకొచ్చారు. తాను కూడా 50 మంది దివ్యాంగులకు ద్విచక్రవాహనాలు అందిస్తానని మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ తెలిపారు. కేటీఆర్​ నాయకత్వంలో ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామినవటం.. ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్​ కుమార్​ కూడా తన వంతుగా 20 ద్విచక్రవాహనాలను దివ్యాంగులకు అందిచనున్నట్లు తెలిపారు. కేటీఆర్​ అడుగుజాడల్లోనే తాము కూడా పయనిస్తూ.. తన శక్తి మేరకు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తానని ప్రకటించారు.

తాము సైతం...

మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు తాము కూడా దివ్యాంగులకు ఉచితంగా వాహనాలు పంపిణీ చేస్తామని, ఇతర సాయం అందిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ బాల్కసుమన్, ఎమ్మెల్యేలు సైదిరైడ్డి, జీవన్ రెడ్డి, విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నవీన్ కుమార్, ఇతర నేతలు ప్రకటించారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details