ఐఐటీలో సీటు పొంది ఆర్థిక ఇబ్బందులతో సతమవుతూ... సాయం అర్థించిన విద్యార్థినికి మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. రెండేళ్లుగా విద్యార్థిని చదువుకోసం ఆర్థిక సాయం అందిస్తున్నారు. వరంగల్ జిల్లా హసన్పర్తికి చెందిన విద్యార్థిని మేకల అంజలి రెండు సంవత్సరాల క్రితం ఐఐటీలో సీటు దక్కించుకుంది. అయితే తన కుటుంబ పేదరికం, ఆర్థిక సమస్యల నేపథ్యంలో తన చదువును కొనసాగించేందుకు ఆర్థిక సహాయం చేయాలని మంత్రి కేటిఆర్ని గతంలో అభ్యర్థించింది. విద్యార్థిని కుటుంబ పరిస్థితి తెలుసుకున్న మంత్రి కేటీఆర్... వ్యక్తిగత హోదాలో గత రెండేళ్లుగా ఫీజులకు అవసరమైన నిధులను అందిస్తూ వస్తున్నారు. ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాదికి, వచ్చే సంవత్సరానికి సంబంధించిన ఐఐటీ ఫీజుల మొత్తాన్ని ఇవాళ ప్రగతిభవన్‌లో అంజలి కుటుంబానికి అందజేశారు.
ktr: ఐఐటీ విద్యార్థిని అంజలికి మంత్రి కేటీఆర్ ఆర్థికసాయం - తెలంగాణ తాజా వార్తలు
పేదింటి ఐఐటీ విద్యార్థిని అంజలి చదువుకి అవసరమైన ఆర్థిక సాయాన్ని మంత్రి కేటీఆర్ అందజేశారు. వరంగల్ జిల్లా హసన్పర్తికి చెందిన విద్యార్థిని మేకల అంజలి చదువుకోసం... రెండేళ్లుగా మంత్రి కేటీఆర్ ఆర్థిక సాయం అందిస్తున్నారు.
ktr
ఈ సందర్భంగా అంజలి చదువు, భవిష్యత్ ప్రణాళికల గురించి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి కేటీఆర్... ఆమె తన చదువు దిగ్విజయంగా పూర్తి చేసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. తమ బిడ్డ చదువుకోసం ఆర్థిక సహాయం అందిస్తున్న మంత్రి కేటీఆర్‌కు అంజలి కుటుంబం ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చూడండి:cm kcr review: జలవివాదాలు, కేంద్రం గెజిట్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష
Last Updated : Aug 25, 2021, 8:44 PM IST