KTR warning to Bandi sanjay: భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ నిర్వాహకం వల్ల 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు మరణిస్తే.. కనీసం స్పందించని సీఎం కేసీఆర్ అంటూ ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఘాటుగా స్పందించారు. హాస్యాస్పద, ఆధారరహిత, బాధ్యతారాహిత్య ఆరోపణలు ఆపకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని సంజయ్‌ను కేటీఆర్ హెచ్చరించారు. చేసే ఆరోపణలు రుజువు చేసేందుకు ఏమైనా ఆధారాలు ఉంటే... వాటిని పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని ట్విట్టర్ వేదికగా హితవు పలికారు. అలా చేయలేని పక్షంలో.. బహిరంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం ప్రచారం కోసం ప్రదర్శిస్తోన్న వాక్చాతుర్యాన్ని ఇకనైన ఆపకపోతే.. అందుకు తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్వీట్ చేశారు.
బండిసంజయ్‌కు కేటీఆర్ స్వీట్ వార్నింగ్.. దానికి తోడు మహిళ వీడియో..! - బండి సంజయ్‌కు వీడియోతో కేటీఆర్ కౌంటర్
KTR warning to Bandi sanjay: భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. అసత్య ఆరోపణలు చేస్తే చట్టరిత్యా చర్యలు తీసుకోవాల్సివస్తుందని తెలిపారు. దీంతో పాటు.. చనిపోయిన ఓ భాజపా కార్యకర్త భార్య తనకు తెరాస ప్రభుత్వం చేసిన సాయం గురించి బండి సంజయ్‌కు వివరిస్తోన్న వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
రాష్ట్రంలోని బలహీనవర్గాలందరి సంక్షేమమే కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాజకీయాలకతీతంగా ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని స్పష్టం చేశారు. ఈ మేరకు.. భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తోన్న ప్రజాసంగ్రామ యాత్రలో.. ప్రభుత్వం చేసిన సాయం గురించి ఓ మహిళ చెప్పిన వీడియోను మంత్రి ట్విట్టర్లో పంచుకున్నారు. తన భర్త ముందు నుంచి భాజపా కార్యకర్త అయినప్పటికీ.. మరణించినప్పుడు ఏ నాయకుడు వచ్చి సాయం చేయలేదని.. కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తోన్న రైతుబీమా కింద రూ.5 లక్షల పరిహారం అందిందని.. బండి సంజయ్‌తో మహిళ చెప్పటం ఆ వీడియోలో ఉంది. ఇబ్బందుల్లో ఉన్న వారికి రాజకీయాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందించడమే కేసీఆర్ సర్కార్ గొప్పతనమని ఈ సందర్భంగా మంత్రి ఉద్ధాటించారు.
ఇవీ చూడండి: