తెరాస భవనాన్ని త్వరగా పూర్తిచేయాలి: మంత్రి కేటీఆర్ - Trs Party Office at Gandimaisamma in Medchal district
మేడ్చల్ జిల్లా గండిమైసమ్మలో నూతనంగా నిర్మిస్తున్న తెరాస పార్టీ భవనాన్ని మంత్రి కేటీఆర్ పరిశీలించారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు.
గండిమైసమ్మ పార్టీ భవనాన్ని సందర్శించిన మంత్రి కేటీఆర్
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గండిమైసమ్మలో నూతనంగా నిర్మిస్తున్న తెరాస పార్టీ భవనాన్ని మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక తెరాస నాయకులకు పలు సూచనలు చేశారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్ రావు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ , జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, మల్కాజిగిరి పార్లమెంటరీ ఇంఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.