హైదరాబాద్ బేగంపేటలోని ధనియాలగుట్ట శ్మశానవాటిక అభివృద్ది పనులను పురపాలకశాఖ మంత్రి తారక రామారావు ఇవాళ ప్రారంభించనున్నారు. ధనియాలగుట్ట శ్మశానవాటికను రూ.4.60కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. ఆధునిక వసతులతో నిర్మించనున్న ఈ శ్మశానవాటికలో ప్రధానంగా ప్రహారీ గోడల నిర్మాణం, చితిమంటల ఫ్లాట్‌ఫాంల నిర్మాణం, అస్తికలను భద్రపరిచే సౌకర్యం, ప్రార్థన గది, వెయిటింగ్ ఏరియా, సెట్టింగ్ గ్యాలరీ, పార్కింగ్ సౌకర్యం, నడక దారి, ఆఫీస్ ప్లేస్, వాష్ ఏరియా, ఎలక్ట్రిఫికేషన్, హరితహారం, ల్యాండ్ స్కేపింగ్‌లను జీహెచ్ఎంసీ నిర్మించనుంది.
హైదరాబాద్‌లో అభివృద్ధి పనులు ప్రారంభించనున్న కేటీఆర్ - minister ktr visit in hyderabad
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో ఇవాళ పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. బేగంపేటలోని ధనియాలగుట్ట శ్మశానవాటిక, ఫతేనగర్‌లో, కూకట్పల్లి హౌసింగ్‌బోర్డులో నాలా విస్తరణ పనులకు శంకుస్థాపన చేయటంతో పాటు మంజీరా మాల్ వద్ద నిర్మించిన పార్కును ప్రారంభించనున్నారు.
![హైదరాబాద్‌లో అభివృద్ధి పనులు ప్రారంభించనున్న కేటీఆర్ minister ktr visit in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10301965-287-10301965-1611064196695.jpg)
minister ktr visit in hyderabad
వీటితో పాటు ఫతేనగర్‌లో నాలా విస్తరణ పనులు, కూకట్పల్లి హౌసింగ్ బోర్డులోని ధనలక్ష్మి కాలనీలో నాలా విస్తరణ పనులు, బాలాజీనగర్‌లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. జేఎన్టీయూ మంజీరా మాల్ వద్ద నిర్మించిన పార్కును ప్రారంభించడంతో పాటు కేపీహెచ్‌బీ 4వ ఫేజ్‌లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను, 6వ ఫేజ్‌లో నాలా పనులను, అల్లాపూర్‌లో నాలా విస్తరణ పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
ఇదీ చూడండి:సాగునీటి గోసకు శాశ్వత పరిష్కారం: సీఎం కేసీఆర్
Last Updated : Jan 20, 2021, 5:08 AM IST