బ్రిస్బేన్ టెస్టులో హైదరాబాద్ కుర్రాడు సిరాజ్ ప్రదర్శనను మంత్రి కేటీఆర్ కొనియాడారు. తండ్రి చనిపోయిన బాధను దిగమింగుకొని... అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడని ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు.
'బాధను దిగమింగుకుని... బాధ్యతతో అదరగొట్టాడు' - minister ktr tweet on siraj
హైదరాబాద్ కుర్రాడు బ్రిస్బేన్ టెస్టులో అదరగొట్టాడంటూ... సిరాజ్ ప్రదర్శనను మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. వ్యక్తిగతంగా బాధ ఉన్నా... బాధ్యతగా ఆడి సిరీస్ గెలవగలమనే నమ్మకాన్నిచ్చాడని ట్విట్టర్ వేదికగా కొనియాడారు.

minister ktr twitter on cricketer siraj performance
తన ప్రదర్శనతో సిరీస్ గెలవగలమనే నమ్మకాన్ని భారత క్రికెట్ ప్రేమికులకు సిరాజ్ ఇచ్చాడని పేర్కొన్నారు. "నీ ప్రతిభను మెచ్చి దివి నుంచి మీ తండ్రి ఆశీర్వదిస్తారు" అని సిరాజ్ను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ట్విట్ చేశారు.