KTR Tweet to PM: ప్రధానికి కేటీఆర్ ట్వీట్.. జాతీయహోదా ఇవ్వాలని విజ్ఞప్తి - ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానికి కేటీఆర్ ట్వీట్
19:18 December 03
ప్రధానికి కేటీఆర్ ట్వీట్.. జాతీయహోదా ఇవ్వాలని విజ్ఞప్తి
KTR Tweet to PM: రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్రమోదీకి ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని ట్వీట్లో ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
పోలవరం, ఎగువ భద్ర ప్రాజెక్టుకు ఇచ్చిన ప్రాధాన్యత కాళేశ్వరం ప్రాజెక్టుకూ ఇవ్వాలని కోరారు. తెలంగాణలోని కాళేశ్వరం లేదా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని సీఎం కేసీఆర్ అనేకసార్లు కోరినట్లు కేటీఆర్ గుర్తుచేశారు. ఈనెల 6న జరగనున్న సమావేశంలో తెలంగాణ ప్రాజెక్టులపై చర్చించేలా ఉన్నతస్థాయి స్టీరింగ్ కమిటీని ఆదేశించాలని.. ప్రధాని మోదీని మంత్రి కేటీఆర్ కోరారు.