తెలంగాణ

telangana

ETV Bharat / city

'సెస్​లను పూర్తిగా రద్దు చేస్తే పెట్రోలు రూ.70కి, డీజిల్‌ రూ.60కే అందించొచ్చు' - పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల

KTR Twwet: పెట్రో ధరల పెంపుపై కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌పురి చేసిన ట్వీట్లపై కేటీఆర్‌ స్పందించారు. రాష్ట్రాలకు నీతులు చెప్పే కేంద్ర ప్రభుత్వం పెంచిన సెస్సులను పూర్తిగా రద్దు చేస్తే పెట్రోలు రూ.70కి, డీజిల్‌ రూ.60కే అందించే వీలుందన్న విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీకి చెబితే మంచిదని హితవు పలికారు.

minister ktr tweet to central minister hardeep singh puri about petrol rates hike
minister ktr tweet to central minister hardeep singh puri about petrol rates hike

By

Published : Apr 29, 2022, 5:31 AM IST

Updated : Apr 29, 2022, 11:53 AM IST

KTR Twwet: పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలకు కేంద్రం పెంచిన ఎక్సైజ్‌ డ్యూటీలు, సెస్​లు కారణం కాదా? అని కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌పురిని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. పెట్రో ధరల పెంపుపై కేంద్ర మంత్రి చేసిన ట్వీట్లపై కేటీఆర్‌ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రో పన్నులు పెంచిందనే మాటే ఉత్పన్నం కాదని, తెలంగాణ ఆవిర్భావం తర్వాత వ్యాట్‌ పెంచలేదన్నారు. క్రూడ్‌ ఆయిల్‌ ధర 2014లో 105 డాలర్లు ఉండగా ఇప్పటికీ అంతే ఉందన్న కేటీఆర్... పెట్రోల్‌ ధర మాత్రం రూ.70 నుంచి 120కి ఎందుకు పెరిగిందో సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రిని ప్రశ్నించారు.

కేంద్రంలోని నాన్‌ పర్ఫామెన్స్‌ అసెట్స్‌, పెంచిన ఎక్సైజ్‌ డ్యూటీలు, సెస్సులు కారణం కాదా అని నిలదీశారు. రాష్ట్రాలకు నీతులు చెప్పే కేంద్ర ప్రభుత్వం పెంచిన సెస్​లను పూర్తిగా రద్దు చేస్తే పెట్రోలు రూ.70కి, డీజిల్‌ రూ.60కి ఈ దేశ ప్రజలకు అందించే వీలుందన్న విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీకి చెబితే మంచిదన్నారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెస్సుల రూపంలో ఇప్పటివరకు రూ.26 లక్షల కోట్లు ప్రజల నుంచి వసూలు చేసింది నిజం కాదా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

ఇదీ చూడండి:

Last Updated : Apr 29, 2022, 11:53 AM IST

ABOUT THE AUTHOR

...view details