KTR Tweet Today: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా కేంద్రంపై మరోసారి ధ్వజమెత్తారు. ఎన్‌పీఏ ప్రభుత్వ పార్లమెంటరీ భాష అంటూ కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. నిరసనకారులను పీఎం 'ఆందోలన్ జీవి' అని పిలవడం మంచిదా అని ప్రశ్నించారు. యూపీ ముఖ్యమంత్రి చేసిన '80-20' ఓకేనా అని అడిగారు.
'ఇదా మీ భాష?.. ఇవన్నీ కరెక్టేనా?'.. భాజపాపై కేటీఆర్ ఫైర్ - కేటీఆర్ తాజా ట్వీట్
KTR Tweet Today: తరచూ ట్విటర్ వేదికగా కేంద్ర సర్కార్ తీరుపై విమర్శలు గుప్పించే రాష్ట్ర మంత్రి కేటీఆర్.. ఈరోజు మరోసారి మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎన్‌పీఏ ప్రభుత్వంలో ఉన్న నేతలు మాట్లాడే బాష అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
KTR
మహాత్మా గాంధీని భాజపా ఎంపీ కించపరిచిన తీరు బాగానే ఉందా.. 'షూట్ సాలోంకో' అని ఓ మంత్రి చెప్పడం సరైందేనా అని కేటీఆర్ నిలదీశారు. రైతు నిరసనకారులను ఉగ్రవాదులని అవమానించారని ఆయన మండిపడ్డారు. ఇవన్నీ సరైనవేనా అని ట్విటర్ వేదికగా.. మోదీని కేటీఆర్ ప్రశ్నించారు.
Last Updated : Jul 16, 2022, 2:02 PM IST