తెలంగాణ

telangana

ETV Bharat / city

కేంద్రంపై మరోసారి కేటీఆర్ సెటైర్... టార్చర్​ పెట్టడంలో కొత్త రికార్డు సృష్టిస్తుందంటూ... - Minister ktr tweet on fuel prices

కేంద్రంపై మంత్రి కేటీఆర్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు వదిలారు. టార్చర్​ పెట్టడంలో కేంద్రం కొత్త రికార్డులు సృష్టిస్తుందంటూ... ట్విటర్​లో విరుచుకుపడ్డారు. పెట్రో ధరలు పెంచడంపై ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు.

కేంద్రంపై మరోసారి కేటీఆర్ సెటైర్... టార్చర్​ పెట్టడంలో కొత్త రికార్డు సృష్టిస్తుందంటూ...
కేంద్రంపై మరోసారి కేటీఆర్ సెటైర్... టార్చర్​ పెట్టడంలో కొత్త రికార్డు సృష్టిస్తుందంటూ...

By

Published : Apr 4, 2022, 12:53 PM IST

ఇంధన ధరల వరుస పెరుగుదలపై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్​ వేదికగా వ్యంగ్యంగా స్పందించారు. చైనా వేధింపుల గురించి పుస్తకాల్లోనే చదివామన్న ఆయన.. కేవలం 14 రోజుల్లోనే 12 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి.. కేంద్రం అన్ని రకాల టార్చర్​లను తిరగరాసి కొత్త రికార్డులను సృష్టిస్తుందని.. ట్విటర్​లో పేర్కొన్నారు. క్రూడ్ ఆయిల్​ ధరలపై పార్లమెంట్ వేదికగా చర్చించేందుకు ఎందుకు వెనకాడుతున్నారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ను కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రం విధించిన సెస్​లను ఉపసంహరించుకుంటే ధరలు తగ్గించవచ్చని అన్నారు.

రాష్ట్రాలు పన్నులు తగ్గిస్తే ధరలు తగ్గుతాయని కొందరు అంటున్నారనన్న కేటీఆర్... తెలంగాణలో 2015 జనవరి నుంచి ఇప్పటి వరకు ఏడేళ్లుగా పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ పెంచలేదని వివరించారు. ఎన్డీయే ప్రభుత్వం విచ్చలవిడిగా వసూలు చేస్తున్న సెస్​లను ఎత్తివేస్తే ఇంధన ధరలు కనీసం 30 శాతం వరకు తగ్గించవచ్చని కేటీఆర్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: కేటీఆర్, డీకే శివకుమార్​ మధ్య ట్విటర్​లో ఆసక్తికర చర్చ

ABOUT THE AUTHOR

...view details