KTR On Cantonment Roads: ప్రజలకు కనీస వసతులు కల్పించలేకపోతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రతిపాదించారు. కంటోన్మెంట్లో రోడ్లను అక్రమంగా మూసివేతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. కేంద్ర ప్రభుత్వం ఎందుకు తగిన చర్యలు తీసుకోవడంలేదని కేటీఆర్ ప్రశ్నించారు.
ktr tweet to kishan reddy: రోడ్ల మూసివేతపై ట్విట్టర్ వేదికగా స్పందించిన మంత్రి కేటీఆర్... కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, కిషన్ రెడ్డికి ట్వీట్ చేశారు. అక్రమంగా రోడ్ల మూసివేతపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారని ట్వీట్లో పేర్కొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని స్థానిక మిలటరీ సంస్థ అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తోంటే కేంద్రం ఎందుకు నియంత్రించడం లేదన్న మంత్రి... ఎవరు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు.