హైదరాబాద్ సమీపంలోని బాటసింగారంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించిన హెచ్‌ఎండీఏ, ట్రక్ డాక్ లాజిస్టిక్స్ పార్కు ప్రారంభానికి సిద్ధమైందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు మంగళవారం ట్విటర్‌లో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం మేరకు ఆదర్శవంతమైన లాజిస్టిక్స్ టౌన్‌షిప్ జాతీయ రహదారి 65, అవుటర్ రింగ్‌రోడ్డు 11వ మార్గం వద్ద ఏర్పాటవుతోందన్నారు.
బాటసింగారం లాజిస్టిక్స్ పార్కు ప్రారంభానికి సిద్ధం
అత్యుత్తమ సౌకర్యాలతో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించిన హెచ్‌ఎండీఏ, ట్రక్ డాక్ లాజిస్టిక్స్ పార్కు ప్రారంభానికి సిద్ధమైంది. బాటసింగారం లాజిస్టిక్స్ పార్కు ఫొటోలు జత చేస్తూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
బాటసింగారం లాజిస్టిక్స్ ప్రారంభానికి సిద్ధం
ట్రక్ పార్కింగు, డాకింగ్ సేవలు, అత్యుత్తమ గిడ్డంగులతో, సంపూర్ణ పర్యావరణ వ్యవస్థ, విలువ ఆధారిత సేవలతో ఇది ఏర్పాటైందని తెలిపారు. మినీ గోదాములు, భోజన, వసతి సౌకర్యాలు, ఆరోగ్య పరిరక్షణతో పాటు పటిష్ఠ భద్రత ఉందని చెప్పారు. బాటసింగారం లాజిస్టిక్స్ పార్కు ఫొటోలను తమ ట్విటర్‌కు కేటీఆర్ జత చేశారు.
- ఇదీ చూడండి :ఆదర్శంగా నిలుస్తోన్న గడ్కోల్ గ్రామం
Last Updated : Jan 27, 2021, 7:34 AM IST