KTR tweet on Somu Veerraju: ఆంధ్రప్రదేశ్‌లో భాజపా అధికారంలోకి వస్తే రూ. 70 కే మద్యం విక్రయిస్తామన్న ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. వావ్.. వాట్ ఎ స్కీమ్.. వాట్ ఎ షేమ్ అంటూ వ్యాఖ్యానించారు. అధికారం కోసం ఏపీ భాజపా నేతలు మరింతగా దిగజారిపోయి వ్యాఖ్యలు చేస్తున్నారని ట్విటర్ వేదికగా విమర్శించారు. చీప్ లిక్కర్‌ను రూ. 50, రూ.70 కి విక్రయించడం భాజపా జాతీయ విధానమా లేక.. నిరాశావాదంలో కూరుకుపోయిన రాష్ట్రాలకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్ వర్తిస్తుందా అని ప్రశ్నించారు.
సోము వీర్రాజు స్టేట్మెంట్