డీఆర్డీవో అభివృద్ధి చేసిన డీయాక్సీ- డీ- గ్లూకోజ్ (2డీజీ) పంపిణీ ఇంకా ప్రారంభం కాలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. నకిలీ ఉత్పత్తులతో ఎవరూ మోసపోవద్దంటూ ట్విట్టర్ ద్వారా సూచించారు.
2డీజీ ఔషధం పంపిణీ ప్రారంభం కాలేదు.. మోసపోవద్దు: కేటీఆర్ - తెలంగాణ తాజా వార్తలు
2డీజీ ఔషధం ఇంకా మార్కెట్లోకి రాలేదని...నకిలీ ఉత్పత్తులతో ఎవరూ మోసపోవద్దని మంత్రి కేటీఆర్ సూచించారు. ఈమేరకు ట్వీట్ చేశారు.
2డీజీ ఔషధం పంపిణీ ప్రారంభం కాలేదు
డీఆర్డీవోతో కలిసి డాక్టర్ రెడ్డీస్ సంస్థ 2డీజీ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. ఇప్పడికే రెడ్డీస్ సంస్థ అందరినీ అప్రమత్తం చేస్తోందన్నారు కేటీఆర్. 2డీజీ ఇంకా మార్కెట్లోకి రాలేదని.. అందువల్ల సాచెట్పై ధర ముద్రించి ఉండదన్నారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు.