కరోనా యోధుల్లో వైద్యుల తర్వాత అత్యంత కీలమైనది పారిశుద్ధ్య కార్మికుల పాత్ర. అటువంటి కార్మికులను జాగ్రత్తగా కాపాడుకుంటున్నట్లు రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా తెలిపారు. ప్రతి కార్మికుడికి కొవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నట్లు వెల్లడించారు.
పారిశుద్ధ్య కార్మికులను జాగ్రత్తగా చూసుకుంటున్నాం : కేటీఆర్ - telangana municipal minister ktr
తెలంగాణలో పారిశుద్ధ్య కార్మికులను జాగ్రత్తగా చూసుకుంటున్నామని రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ అన్నారు. వారు కరోనా బారిన పడకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరికి కొవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.
మంత్రి కేటీఆర్, పారిశుద్ధ్య కార్మికులు, తెలంగాణ న్యూస్
ఇప్పటి వరకు 141 మున్సిపాలిటీల్లో 95.55 శాతం మందికి టీకా అందినట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో 96.19 శాతం కార్మికులు వ్యాక్సిన్ వేసుకున్నట్లు మంత్రి వివరించారు. త్వరలోనే 100 శాతం ప్రక్రియ పూర్తి చేస్తామని ట్వీట్ చేశారు. పారిశుద్ధ్య కార్మికులు కరోనా బారిన పడకుండా రాష్ట్ర సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి స్పష్టం చేశారు.