KTR Tweet on LPG Price: ఎల్పీజీ సిలిండర్ ధర పెరుగుదల ఏప్రిల్ ఫూల్ తరహాలో జోక్ అయితే బాగుండేదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర 250 రూపాయలు పెరిగి 2వేల 253కు చేరిందన్న వార్తా కథనంపై మంత్రి చమత్కారంగా స్పందించారు. ఏప్రిల్ ఫూల్ జోక్ కావాలని తాను సీరియస్‌గా భావిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.
KTR Tweet Today: 'అది ఏప్రిల్ ఫూల్ జోక్ అయితే బాగుండేది' - అచ్చే దిన్‌పై కేటీఆర్ ట్వీట్
KTR Tweet on LPG Price: తన ట్వీట్లతో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. ఈ సారి తన ట్వీట్లకు కాస్త వ్యంగ్యాన్ని జోడించారు. ఎల్పీజీ సిలిండర్ ధర పెరుగుదల ఏప్రిల్ ఫూల్ తరహాలో జోక్ అయితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అచ్చే దిన్ దివస్‌ను ఏప్రిల్ ఫూల్స్ డేగా పోలుస్తూ ట్వీట్ చేశారు.
KTR Tweet Today
అచ్చే దిన్.. దివస్‌ను ఏప్రిల్ ఫూల్స్ డేగా పోలుస్తూ కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విమర్శిస్తూ పోస్టులు పెట్టిన ప్రతిసారి ఇబ్బంది పడేవారు ట్విటర్‌లో తనను అనుసరించవద్దని సూచించారు. కేంద్రం, భాజపా మతతత్వ విధానాలు, దుష్ప్రచారాన్ని తాను ఎండగడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.